ఎల్ ఆర్ ఎస్ గడువు మరో మూడు నెలలు పొడిగించాలి.

Apr 1, 2025 - 00:01
Apr 1, 2025 - 00:06
 0  13
ఎల్ ఆర్ ఎస్ గడువు మరో మూడు నెలలు పొడిగించాలి.

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేట టౌన్, మార్చి 31:-

రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ఎస్ కోసం ఈ నెల 31 వరకే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం సరికాదని, ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ గడువు మరో మూడు నెలలు పొడిగించాలి అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 31 తారీకు అని కట్ ఆఫ్ డేటు ప్రభుత్వం ప్రకటించడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే ప్రజలు భవన నిర్మాణాలు చేసుకునే సందర్భంలో క్రమబద్ధీకరణ చేసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. బఫర్ జోన్ కు, ఎఫ్ టి ఎల్ కు జీవోలో కేవలం 30 మీటర్ల దూరం మాత్రమే అని ప్రకటించి ప్రస్తుతం 200 మీటర్లు వరకు అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళనకు గురై మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కంప్యూటర్లు ఆన్లైన్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం సర్వర్ ఆన్లైన్ సమస్యలు మేము ఏం చేయలేం అని చెబుతున్నారు. చెప్పడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారని వివరించారు. 2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలి. పట్టాదారు పాస్ బుక్ మీద నాలా కన్వెన్షన్ కింద ఒక ఎకరం వరకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేలా నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఎల్లారీస్ ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం 450 జీవోను రద్దు చేయాలని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ప్రత్యేక పక్కాభవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి కంభంపాటి అంజయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ గౌరవ సదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి బానోతు జానీ నాయక్ సారగండ్ల కోటేష్ రాపర్తి జానయ్య ఎస్ కే బాబా అనే పెగాపురం నరసయ్య సోమయ్య యాకోబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333