జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా పోలీస్ కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్ అన్నారు.భారత రాజ్యాంగం ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అదేశాల మేరకు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఏ.ఓ గారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సిబ్బంది చే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్బి,డీసీ ఆర్బి, సిసి ఎస్ ఎస్సై లు శ్రీనివాస్, రజిత, విజయ కుమార్, సీసీ లోహిత్, సూపరింటెండెంట్ నాయీం ,డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.