ముసాయిదా ఓటర్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంపీడీవో శంకరయ్య

Aug 29, 2025 - 11:52
Aug 29, 2025 - 11:53
 0  112
ముసాయిదా ఓటర్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు 28 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి సర్కులర్ నెంబర్ 548/టి జి ఎస్ ఈ సి–పి ఆర్ 2025 తేదీ 26–8–2025 అనుసరించి గ్రామపంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల కొరకు అడ్డగూడూరు మండలంలో అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ జాబితాను నిబంధనలను అనుసరించి గ్రామపంచాయతీ వార్డువారిగా రూపొందించి అట్టి 17 గ్రామ పంచాయతీల యొక్క ముసాయిదా ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలో మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయ నోటీస్ బోర్డులపై అలాగే సర్కులర్ నెంబర్ 1498/టీజీఎస్ఇసి-పి ఆర్/2024 తేదీ 26-08-2025ను అనుసరించి 17 గ్రామపంచాయతీల యొక్క ముసాయిదా పోలింగ్ స్టేషన్ ల జాబితాలను గ్రామపంచాయతీ కార్యాలయములో మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయ నోటీస్ బోర్డ్ లపై ప్రచురించడమైనది.ఇట్టి ముసయిదా ఇట్టి ముసాయిదా గ్రామపంచాయతీ వార్డువారిగా ఓటర్ జాబితాల విషయంలో గాని అలాగే ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాల విషయంలో గాని ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఎడల రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై నోటిఫికేషన్లలో తెలిపిన విధంగా 28–8–2025 నుండి 3–8–2025 వరకు గ్రామపంచాయతీ కార్యాలయం నందు తమ అభ్యంతరములను లిఖితపూర్వకంగా సమర్పించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా రాజకీయ పార్టీల మండల స్థాయి ప్రతినిధులతో తేదీ 30–8– 2025 రోజున ఇట్టి గ్రామపంచాయతీల యొక్క వార్డువారిగా ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా విషయమై సమావేశం నిర్వహించబడును. 29– 8– 2025 జిల్లా ఎన్నికల అథారిటీచే జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం 30– 8– 2025 మండల పరిషత్ అభివృద్ధి అధికారి చే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం 31–8 2025 తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ 02–09–2025 ప్రచురణార్థం సమర్పించనైనది. సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్ అడ్డగూడూరు అధికారి శంకరయ్య తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీ ఓ ప్రేమలత, కార్యదర్శులు,కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.