ఆత్మకూర్ ఎస్ కేజీబీవీలో సెప్టెంబర్ 7న రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

Aug 28, 2025 - 21:28
Aug 29, 2025 - 14:49
 0  4
ఆత్మకూర్ ఎస్ కేజీబీవీలో సెప్టెంబర్ 7న రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆత్మకూర్ ఎస్ కేజీబీవీలో సెప్టెంబర్ 7న రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ ఆత్మకూర్ ఎస్... ఆత్మకూర్ ఎస్ కేజీబీవీ పాఠశాల లో సెప్టెంబర్ 7న హైదారాబాద్ లోజరిగే సదస్సు పోస్టర్ ను ఐఎఫ్టియుఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నర్సక్క పాల్గొని మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో ప్రధానంగా శాఖ ల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు .కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలనీ ,సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి అన్ని రంగాలలోని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు అందర్నీ పర్మినెంట్ చేయాలన్నారు .స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి వారిని పెర్మనెంట్ చేస్తూ కనీస వేతనాలను అమలు చేయాలి ఉద్యోగ భద్రత పని స్థలాలలో రక్షణ కల్పించాలి ఎనిమిది గంటల పని దినాన్ని పరిరక్షించాలి అందులో భాగంగా సెప్టెంబర్ 7వ తారీఖున హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు రాష్ట్ర సదస్సుకు ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నటువంటి కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుగుణక్క, వెంకటమ్మ, పద్మ, గునుగంటి సంధ్య, తాడిచర్ల గీత, జంపాల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు