జోగులాంబ గద్వాల్ జిల్లా R.T.C డిపోమేనేజర్ కి వినతి పత్రం అందచేసిన.
~ అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్..~
జోగులాంబ గద్వాల 24 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ. పట్టణం నుండి నిత్యం వందలాది మంది వృద్ధులు, విద్యార్థులు, మహిళలు గద్వాల్ మీదుగా... మహబూబ్ నగర్, హైదరాబాద్ చేరుకోడానికి రైళ్లలో రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రతిరోజు అయిజ పట్టణం నుండి బయలుదేరే R. T. C. బస్ లు ప్రయాణికులను గద్వాల్ లో మెయిన్ రోడ్ పైనే దించి వెళుతున్నాయి... దీనితో ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు,మహిళలు, విద్యార్థులు,చిన్నారులు రైల్వేస్టేషన్ చేరుకునేలోపే రైళ్లు మిస్ అవుతున్నాయి.ఆలాగే తిరుగుప్రయాణంలో గద్వాల్ రైల్వేస్టేషన్ లో రైలు దిగగానే ముఖ్యంగా రాత్రిపూట మహిళలుచాలా ఇబ్బంది పడుతున్నారు.
రైళ్ల రాకపోకల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు వేకువ జామునుండి మొదలుకొని రాత్రి వరకు... రైళ్ళ రాకపోకల నిర్నీత సమయానికి R.T.C. బస్ లను రైల్వేస్టేషన్ ప్రాంగణం వరకు అందుబాటులో ఉంచాలని అయిజ పట్టణ ప్రజల సౌకర్యార్థం వారి తరపున జోగులాంబ గద్వాల్ జిల్లా డిపోమేనేజర్ కి ... - అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ -- వినతిపత్రం అందచేశారు .