మాదిగ అమరవీరుల యాదిలో....అన్నదానం

Mar 1, 2025 - 19:21
Mar 1, 2025 - 19:43
 0  4
మాదిగ అమరవీరుల యాదిలో....అన్నదానం
మాదిగ అమరవీరుల యాదిలో....అన్నదానం

మాదిగ అమరవీరుల త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి

మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధన

మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పేటలో

ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్దాస్ జానీ(జే) ఆధ్వర్యంలో అన్నదానం

సూర్యపేట 1 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కృషితో పాటు అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మాదిగలు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ,  యాతాకుల రాజయ్యమాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ,  జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు, నాయకులు బొజ్జ సైదులు మాదిగలు అన్నారు. మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్దాస్ జానీ(జే) ఆధ్వర్యంలో వద్ద పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు వల్దాస్ జానీ(జే) మాట్లాడుతూ మాదిగల 30 సంవత్సరాల కల ఎస్సి వర్గీకరణ సాధనలో ఎంతో మంది మాదిగ లు అమరులయ్యారని వారి జ్ఞాపకార్థం నేడు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. వర్గీకరణ సాధనలో ఆమరులైన మాదిగ అమరవీరులను సంవత్సరంలో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగపై ఉందన్నారు. జాతి కోసం అమరులైన మాదిగ అమరవీరుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మేడి కృష్ణ మాదిగ,  ములుగురి రాజు మాదిగ,  చెరుకుపల్లి సతీష్ మాదిగ,  బొజ్జ వెంకన్న మాదిగ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333