బొడ్డు శ్రీధర్ రెడ్డి సంతాప సభ
01-06-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన లక్ష్మీ పల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్ రెడ్డి గారి సంతాప సభను తేదీ:02/06/2024. ఆదివారము. సమయం, ఉదయం 11:00 గంటలకు శ్రీధర్ రెడ్డి గారి స్వగృహమునందున లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు కుటుంబ సభ్యులఆధ్వర్యంలో సంతాప సభను జరుపబడును
కావున శ్రీధర్ రెడ్డి గారి సంతాప సభకు కొల్లాపూర్ తాలూకా ఏడు మండలాల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మరియు ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి అభిమానులు, మరియు శ్రీధర్ రెడ్డి గారి అభిమానంతో పాటుు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సంతాప సభలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ శ్రీధర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరేలా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము.
చిన్నంబావి మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆహ్వానం