బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు కు జన్మదిన శుభాకాంక్షలు
బిషప్ దుర్గం ప్రప్రభాకర్l
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్
శనివారం 01 మార్చి : సూర్యాపేట పట్టణ కేంద్రం 4వ వార్డు రామకోటి తండా నందు చార్లెట్ హోం ఆనాధ పిల్లల ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు కు పూల బొకే శాలువాతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్, చివ్వేంల మండల పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. గుగులోతు బాలాజీ నాయక్ ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఎంతో మంది ఆనాధ పిల్లలను చేరదీసి నిస్వార్ధ సేవలు అందిస్తూ మానవ సేవయే మాధవ సేవాగా నిరంతరం నిస్వార్ధ ప్రేమను పంచుతూ పేద ఆడపిల్లలకు వివాహాలు చేస్తూ, వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణి చేస్తూ ప్రజల, మరియు ప్రభుత్వ మన్ననలు పొందుతున్న చార్లెట్ హోం ఆనాధ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలు యేసు క్రీస్తూ దయవలన జరుపుకోవాలని వారి కోరాకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమం లో జాటోత్ దాసు నాయక్, జాటోత్ శంకర్ నాయక్ ఎల్ ఐ సి ఏజెంట్, దుర్గం హెప్సిబా,చార్లెట్ హోం డైరెక్టర్ జాటోత్ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు