భారత దేశ కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యవస్థాపక పితామహులలో ఒకరైన కామ్రేడ్ సింగారవేలు కు నివాళి

తెలంగాణ వార్త రిపోర్టర్ భారత దేశ కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యవస్థాపక పితామహులలో ఒకరైన కామ్రేడ్ సింగారవేలు కు నివాళి ! !! ప్రజా బంధువు అవార్డు గ్రహీత... కామ్రేడ్ జే కే ఆర్ గారి.... జె ఎస్ ఆర్ సార్ 8328277285 9848540078 బహిరంగ లేఖ... -------------------------------------------------------------------------- మలయపురం (సింగారవేలర్) సింగారవేలు భారత దేశ జాతీయ ఉద్యమంలో, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒక ప్రధాన నాయకుడు. మొదట కాంగ్రెస్ నాయకత్వంలో, తరువాత, నాటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరాడు.1918లో, భారతదేశంలో మొట్టమొదటి ట్రేడ్ యూనియన్‌ను స్థాపించాడు. 1923 మే 1న దేశంలో మొట్టమొదటి మే దినోత్సవ వేడుకను నిర్వహించాడు. 1925లో, భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక పితామహులలో ఒకడు అయ్యాడు; కాన్పూర్‌లో దాని ప్రారంభ సభకు అధ్యక్షత వహించాడు. బ్రిటిష్ ప్రభుత్వం అతనితో పాటు ఇతర నాయకులను కూడా రాజ ద్రోహ ఆరోపణలపై నిర్భందించారు, అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల విడుదలచేయ బడ్డాడు. సింగరవేలర్ ఒక విప్లవకర సామాజిక సంస్కర్త కూడా ; అతడు తన జీవితంలో తొలుత కుల వ్యవస్థను, వివక్షతలను వ్యతిరేకిస్తూ బౌద్ధమతాన్ని స్వీకరించాడు, ముఖ్యంగా దేశంలో తీవ్రంగా ఉన్న అమానుషమైన అంటరానితనానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. వెనుకబడిన కులాలకు సమాన హక్కుల కోసం పోరాడిన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆత్మగౌరవ ఉద్యమంలో కూడా ఆయన ముందంజలో ఉన్నాడు. అయితే , వృద్ధాప్యంలో, చివరి దశలో క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగాడు. సింగరవేలార్ 85 సంవత్సరాల వయస్సులో 11 ఫిబ్రవరి 1946న మరణించే వరకు తాను ఆశించిన లక్ష్యానికి అంకితమై దృఢంగా పోరాడాడు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన వారసత్వం మనకు స్ఫూర్తిదాయకం అనే గుర్తింపు అవసరం. ``మన దేశంలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు క్రూర జంతువుల్లాంటి విదేశీ పాలకుల నుండి మాత్రమే కాకుండా, రాబోతున్న భారతీయ యాజమానుల పట్టు నుండి కూడా విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్ర్యం" అని సింగార వేలు తన లక్ష్యంగా చాటాడు . ఆ మహత్తర లక్ష్యసాధనకు కృషి చేయడమే సింగార వేలు లాంటి పోరాట యోధులకు మనం అర్పించే నిజమైన నివాళి..... అనే పేర్కొన్నారు.... ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్