అడ్డగూడూరు మండలంలోని ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు హెచ్చరిక

ఎస్సై డి నాగరాజు 

Jul 15, 2024 - 21:40
Jul 15, 2024 - 21:41
 0  52
అడ్డగూడూరు మండలంలోని ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు హెచ్చరిక
అడ్డగూడూరు మండలంలోని ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు హెచ్చరిక

అడ్డగూడూరు 15 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల ట్రాక్టర్ యజమానులకు డ్రైవర్లకు హెచ్చరిక చేశారు.అడ్డగూడురు మండలంలోని ఎవరైనా ఫుల్ వీల్స్ ట్రాక్టర్ తో తారు రోడ్డు పై ట్రాక్టర్లను నడిపవద్దు ,ట్రాక్టర్లను వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో దమ్ములు చెయ్యడానికి ఉపయోగించే ఫుల్ వీల్స్ తో తార్  రోడ్డు పై ప్రయాణిస్తే, కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.అలాగే ప్రజల అస్థికి నష్టం కలిగిస్తే, ట్రాక్టర్ యజమానుల పై మరియు డ్రైవర్ల పై కేస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.18 సంవత్సరలు నిండని వాళ్లు వాహనాల నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.అడ్డగూడూరు ఎస్సై డి నాగరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333