సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటానికి నివాళి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటానికి నివాళి.... పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పోరాటం అమరుల త్యాగ ఫలితమే నేడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కళ సాకారం.... మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి.... ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలోని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం అమరులైన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సూర్యాపేట నియోజకవర్గం ఇన్చార్జి ములకలపల్లి రవి మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ మరియు 57 ఉపకులాలకు విద్యార్థులకు విద్య,ఉద్యోగ,ఆర్థిక,రాజకీయ,సంక్షేమ పథకాలలో జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలని 1994 నుంచి గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో మొదటి సారి 1999లో ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగలకు దాదాపు 22,000 వేల ఉద్యోగాలు రావడానికి అమరవీరుల అత్యగం ముఖ్య పాత్ర పోషించి తమ ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళ కృషి వెలకట్టలేనిది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ, అధికార ప్రతినిధి, మిర్యాల చిన్ని మాదిగ, పల్లెల నాగయ్య మాదిగ, కలకోట్ల ప్రసాద్ మాదిగ, బొల్లెపాక ముత్య లింగయ్య మాదిగ, పల్లెలు నాగయ్య మాదిగ, సీతారాములు , ఎల్లయ్య మల్లయ్య, రామచంద్ర, రమేష్, తదితరులు పాల్గొన్నారు