ముస్తాబైన పిల్లలమర్రి శివాలయాలు

Mar 7, 2024 - 21:04
Mar 7, 2024 - 21:13
 0  3
ముస్తాబైన పిల్లలమర్రి శివాలయాలు
ముస్తాబైన పిల్లలమర్రి శివాలయాలు
ముస్తాబైన పిల్లలమర్రి శివాలయాలు

వేలాదిగా తరలిరానున్న భక్తులు

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి

శివాలయాల్లో పూజలు చేసిన కలెక్టర్‌ దంపతులు

మహాశివరాత్రి వేడుకలకు పిల్లలమర్రి శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందమైన విద్యుత్‌ కాంతులతో పాటు రంగురంగుల పూలతో చారిత్రక శివాలయాలు అందంగా ముస్తాబు చేశారు. వేలాదిగా తరలిరానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు దంపతులు గురువారం శివాలయాల్లో పూజలు చేసి ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సూర్యాపేట రూరల్‌ సీఐ సురేందర్‌ రెడ్డి, ఎస్‌ఐ బాలు నాయక్‌ ఆధ్వర్యంలో బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సంబంధిత ఏర్పాట్లు చేశారు.

 ప్రతినిధి/ సూర్యాపేట

మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి 11 వరకు పిల్లలమర్రి శివాలయాలల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. గురువారం ఆలయ ప్రవేశం, గణపతి పూజ, స్వస్థి వాచనం, రక్షాబంధనం, అంకురారోపణ, సకల దేవతల ఆహ్వానం, కలశ స్థాపన పూజల ను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్‌ కొట్ల సైదులు, కౌన్సిలర్‌ బచ్చలకూరి శ్రీనివాస్‌, డైరెక్టర్లతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
-----
అభిషేకాలకు ఏర్పాట్లు పూర్తి
-----
మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని భక్తులు ఆ దేవదేవునికి పంచామృత అభిషేకం చేసేందుకు పిల్లలమర్రి దేవాలయాలకు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలో దేవాలయ కమిటీఆధ్వర్యంలో ఎరకేశ్వర, మహదేవనామేశ్వర , త్రికుటాలయాల్లో సామూహిక అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎరకేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా సాల గ్రామాలు(చిన్న శివలింగాలకు) కూర్చొని అభిషేకం చేసేలా, త్రికుటాలయంలో సామూహిక అభిషేకాలు చేసే విధంగా సౌకర్యం కల్పించారు.
-----
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్‌ఐ
-----
ఉమ్మడి జిల్లాతో పాటు పలు జిల్లాల నుంచి ప్రసిద్ధి చెందిన పురాతన పిల్లలమర్రి శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానుడడంతో రూరల్‌ ఎస్‌ఐ బాలు నాయక్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు గ్రామంలోకి ప్రవేశించకుండా పార్కింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. దుకాణదారులు రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333