**భక్తులకు సువర్ణ అవకాశం కోదాడ నుండి మూడు ప్రముఖ దేవస్థానలకు ఒకేరోజు పర్యటన"కోదాడ డిపో ఆధ్వర్యంలో*

Jun 7, 2025 - 20:39
 0  42
**భక్తులకు సువర్ణ అవకాశం కోదాడ నుండి మూడు ప్రముఖ దేవస్థానలకు ఒకేరోజు పర్యటన"కోదాడ డిపో ఆధ్వర్యంలో*

భక్తులకు స్వర్ణావకాశం కోదాడ నుండి మూడు ప్రముఖ దేవస్థానాలకు ఒకే రోజు పర్యటన!

కోదాడ, జూన్ 7*తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ....

భక్తులకు సంతోషకరమైన శుభవార్త టి జి ఎస్ ఆర్టీసీ(TGSRTC )కోదాడ డిపో ఆధ్వర్యంలో ఆధ్యాత్మికతను కోరుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ప్రతి శుక్రవారం, శనివారం రోజులలో సూపర్ లగ్జరీ బస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ దేవాలయాల సందర్శనకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయబడింది.ఈ పర్యటనలో భక్తులు ఒకే రోజు‌లోనే మూడు ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అదృష్టాన్ని పొందగలుగుతారు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం

సదరు బస్సు కోదాడ నుంచి సాయంత్రం 7:00 గంటలకు బయలుదేరి, అన్ని దేవాలయాల్లో దర్శనం అనంతరం మరుసటి రోజు రాత్రి 9:00 గంటల లోపు కోదాడకు తిరిగి చేరుకుంటుంది.

???? ప్యాకేజీ ధర: రూ.1300/- మాత్రమే

???? ప్రత్యేక సౌకర్యం:

 30 మందికి మించి భక్తులు ఉన్నచో, కోరిన తేదీకి ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటుందని

  కోదాడ డిపో మేనేజర్ బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తులు ఈ అవకాశం కోల్పోకుండా సద్వినియోగం చేసుకోవాలని, ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలని డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు తెలిపారు.

???? ఇతర వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు !

77804 33533

95739 53143

99592 26302

90321 53066

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State