నేమ్మికల్ పాఠశాలను కళాశాల నూతన భవనం లోకి మార్చాలి*

Feb 20, 2025 - 20:48
 0  7
నేమ్మికల్ పాఠశాలను కళాశాల నూతన భవనం లోకి మార్చాలి*

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  నేమ్మికల్ పాఠశాలను కళాశాల నూతన భవనం లోకి మార్చాలి ఆత్మకూర్ ఎస్. మండల పరిధిలోని నేమ్మికల్ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరడం వల్ల పాఠశాలను కళాశాల కోసం నిర్మించి నిరుపయోగంగా ఉన్న నూతన భవనంలోకి మార్చాలంటూ మండల విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో హసీo కు గురువారం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరగతి గదులు కూలుటకు సిద్ధంగా ఉన్నాయని విద్యార్థులు ప్రాణ భయంతో విద్యకు దూరమవుతున్నారని వెంటనే కళాశాల కోసం అదనంగా నిర్మించిన భవనం నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్న నిరుపయోగా ఉందని అందులోకి పాఠశాలను మార్చి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ లు నాగమ్మ, లక్ష్మమ్మ, పద్మ, లింగమ్మ, ఎంవీఎఫ్ ఇన్చార్జి లలిత, సైదమ్మ, అలివేలు , లక్మి తదితరులు పాల్గొన్నారు