బ్రూనై  రాచరిక పాలనలో ఇంత ఆడంబరమా

Sep 13, 2024 - 09:30
Sep 25, 2024 - 15:07
 0  11

ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంలో  సుల్తాన్ రాజభోగాలు
ప్రపంచవ్యాప్తంగా చర్చించడమా?*  ప్రాథమికంగానైనా ఆ దేశ స్వరూపాన్ని  తెలుసుకుందాం  !!!భోగాలకు దాసులైన పాలకులు  సుపరిపాలన అందించలేరు  .*ప్రజా పాలనకై డిమాండ్ చేయడం  సర్వత్రా హర్షనీయం  !!!
*************
---వడ్డేపల్లి మల్లేశం
ఏ దేశంలో నైనా పరిపాలన ప్రజలకు  నచ్చని పరిస్థితిలో ప్రజలు ఆందోళన చేయడం ప్రతిఘటించడం మామూలే.  రాచరిక వ్యవస్థలో కొంత నిర్బంధం అణచివేత ఉండవచ్చు కానీ మితిమీరినటువంటి నియంత్రణను  ప్రజలు ఓర్చుకోలేరు. అనేక చరిత్రక సంఘటన ద్వారా ఈ  విషయం రూఢి అవుతున్నది . పూర్తి ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రాంతంలో కూడా  నిర్బంధం అణచివేత  పెట్టుబడి దారి అనుకూల విధానాలు రాజ్యమేలుతుంటే  పేద వర్గాలకు బడ్జెట్లో  0  చూపిస్తున్న పద్ధతిని ఏమనాలి? ఇది కూడా రాచరిక ముసుగులో కొనసాగుతున్న ప్రజాస్వామ్యమేనా?  రాజ భోగాలకు అలవాటు పడినటువంటి రాజు ప్రజా పరిపాలనను అందించడం కొంత ఇబ్బందికరమే!  కాబట్టి పరిపాలకులు ఎప్పుడు కూడా   భోగలా లసత్వానికి దూరంగా ప్రజాసేవకు చేరువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశ ప్రజలకు మేలు చేకూరుతుంది . సెప్టెంబర్  3,4.   2024 రెండు రోజులపాటు భారత ప్రధాని  బ్రూనై దేశంలో పర్యటించిన సందర్భంగా  అనేక ఒప్పందాలు చేసుకోవడంతో పాటు ఆ దేశం ఏర్పడిన 1984 తర్వాత భారత ప్రధాని అక్కడికి వెళ్లడం ఇదే ప్రథమం కావడం  విశేషం.  భారత ప్రధాని ఆ దేశ పర్యటన చేసిన సందర్భంగా అక్కడ రాజు  నివాస భవనము,  వ్యక్తిగత ఆదాయము, భోగభాగ్యాలు,  విలాసాలకు ఏ రకంగా  రాజు  అలవాటు పడినాడు అనే అంశాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చినాయి  .ఈ సందర్భంలో  పాలకుల యొక్క  కర్తవ్యాలు  విలాసాల కారణంగా వైఫల్యాలు,  ఆ దేశం యొక్క చరిత్ర  రాజభవనంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకోవడం  కొంతవరకు అవసరం.  అంతిమంగా దేశం ఏదైనా  ప్రజలే ముఖ్యం కానీ పాలకులు కాదు అనే సిద్ధాంతాన్ని  అన్వయించుకోవడం ద్వారా  ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతి చోట ప్రజా ఉద్యమాలు  ఎగిసి పడతాయని  ఆ రకమైనటువంటి భావోద్వేగాన్ని ప్రపంచ దేశాలకు భారత దేశ ప్రజలు అందిస్తారని ఆశిద్దాం.
      బ్రూనై దేశం  భౌగోళిక స్థితి - విలాసాల రాజభవనం
***************
  చైనాకు పో రుగున  ఆగ్నేయ ఆసియాలో   బోర్ నియో ద్వీపములో ఉన్న  సార్వభౌమాధికారం గల ఏకైక దేశం బ్రూనై అని తెలుస్తున్నది.  అంటే ఆ ద్వీపంలో  ఇండోనేషియా మలేషియా కు చెందిన కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నట్టుగా అవగతం చేసుకోవాలి  7 లక్షల 48 వేల 160  చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి  ఈ దివిలో  స్వతంత్ర దేశంగా  1984 జనవరి 1 నుండి బ్రూనై  కొనసాగుతున్నట్లుగా చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తున్నది . చాలా కాలం పాటు ఇంగ్లాండ్ ఆధీనంలో ఉన్న ఈ దేశం  స్వతంత్ర పోరాటం అనంతరం   ఈ దేశం యొక్క జనాభా 2010 లెక్కల ప్రకారం 4 లక్షలు గా  నమోదైనది  .ఈ దేశాన్ని స్టేట్ ఆఫ్ బ్రునై  దారు సలాం  అని పిలుస్తారు ఈ దేశం యొక్క రాజధాని బ్యాండర్ శ్రీ  బెగావన్  ఈ దేశం యొక్క అధికార భాష మలై .
        వ్యక్తిగత ఆదాయమైనా రాజు కానీ పాలకులు ఎవరైనా  భోగాలకు అలవాటు పడి ఖరీదైన డ్రెస్సులతో  ఆడంబరాలతో   రాజభవనాలు కూడా  విలాసవంతంగా ఉన్నప్పుడు   గొప్పదనాన్ని చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది కానీ  పాలకుల యొక్క  పాలనా సామర్థ్యానికి కొలమానం కాదు.  ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉండి , విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడం ద్వారా  ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడమే పాలకుల యొక్క లక్ష్యం.  ఎంతసేపు అధికార యంత్రాంగం పాలకులు, ప్రధానమంత్రి రాష్ట్రపతి రాజు  వంటి పాలకుల యొక్క  అధికారాలు, నివాస భవనాలు,  ఉపయోగించే వస్తువులు,
మిగతా వ్యక్తిగత వివరాలను అధికంగా చూపడం  పాలకుల యొక్క ఆధిపత్యాన్ని  ప్రదర్శించడానికే కానీ ప్రజా ప్రయోజనం కొరకు కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . ఇక బృనై సుల్తాన్ జీవన విధానం , ఆడంబరం, పాలనాశైలి ఎలా ఉన్నదో ఒకసారి పరికిద్దాం.
     బ్రూనైలో సుల్తాన్ ప్యాలెస్ ను ఇస్తావా నూరుల్ ఇమ న్  అని పిలుస్తారు.  రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ రాజభవనంలో  5 స్విమ్మింగ్ పూలు, 1700 బెడ్ రూములు , 250 బాత్రూములు,  110 గ్యాలరీలు  ఉన్నట్లుగా  పత్రికల తో పాటు గూగుల్ కథనం తెలియజేస్తున్నది . అంతేకాకుండా రాజుకు ప్రైవేటు రంగంలో 747 బోయిన్ విమానం కూడా  సొంతం ఉండడాన్ని మనం గమనించాలి  ప్రపంచంలోనే అత్యంత నివాస భవనంగా గిన్నిస్ రికార్డు పొందినటువంటి ఈ రాజభవనం  ఆ దేశం స్వాతంత్రం పొందిన  సంవత్సరం అంటే 1984 లోనే  140 కోట్ల డాలర్లు వెచ్చించి నిర్మించినట్లుగా  తెలుస్తూ ఉంటే  ఇందులో సుమారు 7వేల విలాసవంతమైన కార్లు  అందుబాటులో ఉంటే  41 వేల కోట్ల రూపాయలు వెచ్చించు కొన్న 600 రూల్స్ రాయిస్ కార్లు  అంతేకాకుండా 400 ఫెరారీ 380  బెంటలీ కార్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది  ఇంకా అనేక వందలాది వాహనాలు  వీరి ఆధీనంలో ఉంటే  ప్రపంచంలోనే  ఉన్న ఏడు ఫెరారీ  456  జీటీవెన్సీలో  ఒకటి సుల్తాన్ దగ్గర ఉండడం  మరింత ప్రత్యేక  మైన విషయం.  విలాస పురుషుడిగా పేరన్నటువంటి బ్రూనై సుల్తాన్  హాసనల్ బోల్కియా  రెండవ ఎలిజబెత్ రాణి తర్వాత అత్యంత కాలం పరిపాలించిన  పాలకుడు కూడా.    విలాస జీవితానికి చిరునామాగా గడిపిన ఆయన జీవితం  పూర్తిగా పాశ్చాత్య శైలిలో ఆడంబరాలతో కొనసాగుతుంటే  ఆ రాజ కుటుంబం యొక్క మొత్తం సంపద  3 లక్షల 28 వేల కోట్లు ఉంటుంద  అంచనా వేశారు  చమురు సహజవాయువు ద్వారా వచ్చే ఆదాయమే ఆ కుటుంబ సంపద అని చెబుతున్నప్పటికీ  ఇంత విలాసవంతమైన జీవితం గడపడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కూడా  తెలుసుకోవలసిన అవసరం చాలా ఉన్నది . 1946లో జన్మించిన  సుల్తాన్ విదేశాలలో విద్యను అభ్యసించిన తర్వాత 19 వయసులోనే వివాహం చేసుకోవడం 22 ఏళ్లకే రాజుగా పట్టాభిషేకం పొందడం  ఊహించని పరిణామమే  1968లో రాజుగా బాధ్యతలు చేపట్టి ఇప్పటివరకు కొనసాగుతుంటే  తన ఆడంబరానికి ఆనవాలుగా అన్నట్లు  7000కీ.మీ. దూరం ప్రయాణించి లండన్ లోని  ది డోర్ సిస్టర్ హోటల్లోని  కటింగ్ షాపులో  16.5 లక్షలు వెచ్చించి జుట్టు ట్రిమ్ చేయించుకోవడం అంటే  ఏ o త ఖర్చుతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు బహుశా ప్రపంచంలో  ఏ పాలకునికి లేనటువంటి భోగభాగ్యాలు సంపద విలాస అనుభవాలు  బ్రు నై సుల్తాన్ కి ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో!.
           ఇంత విలాసవంతమైన నేపథ్యం ఉన్నటువంటి   బ్రూనై సుల్తాన్ తో జరిపిన చర్చల సందర్భంగా బలమైన సంబంధాలకు  రెండు దేశాలు  ఆసక్తిగా ఉన్నట్లు చెప్పడంతో పాటు అనేక అంశాల పైన  ఏకాభిప్రాయానికి  రావడం  మంచిదే. కానీ  ఆ సుల్తాన్ యొక్క ఆడంబరాలను గమనించి  మన ప్రధానితో సహా ప్రపంచంలోని ఏ  పాలకులైన  ఆ విలాసాలకు అలవాటు పడితే  ప్రజలకు దూరమైనట్లే . తన సొంత ఆస్తి ఖర్చు  పెడుతుండవచ్చు కానీ  అది అనుకరణకు ఆదర్శానికి విఘాతం కలిగించే అo శం. పాలకుడు ఎప్పుడైనా ప్రజలకు ఆదర్శప్రాయంగా  నిరాడంబరంగా  అందుబాటులో ఉండడం ద్వారా  ప్రజల హృదయాలను గెలుచుకోవాలి  తెలంగాణ రాష్ట్రంలో  తొలి ప్రభుత్వంలో టిఆర్ఎస్ నేత కే చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన మంత్రివర్గ సహచరులని కలుసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు.  మరి బ్రూనై సుల్తాన్  ప్రజల విన్నపాలు అందుకోవడానికి అనుమతి  ఇచ్చినట్లేనా అని  ప్రజలు సందేహించే అవకాశాలు కూడా లేకపోలేదు. " విలాసాలను తగ్గించుకుని, రాజభోగాలను విసర్జించి,  సామాన్య సామాజిక జీవితానికి అలవాటు పడి, ప్రజల సమస్యలను  పరిష్కరించడానికి నిరంతరం ప్రజా జీవితం లో  ఉన్నప్పుడు మాత్రమే పాలకుడు గుర్తించబడతాడు.  సుల్తాన్ కు  ఆ అవకాశం ఉందా? లేక అక్కడ ప్రజలకు అవసరం లేదా ? తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది.  పాలకులు ప్రజలకు దూరంగా,ప్రజలను  అనుమతించకుండా , విజ్ఞప్తులు స్వీకరించకుండా  ఉన్నంతకాలం ప్రజలు కూడా ఆ పాలకులను వెలివేస్తారని తెలుసుకోవడం ఎవరికైనా మంచిది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అబార్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333