నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన
యస్.సురుణ ఆదర్శ గౌడ్
చిన్నంబావి మండలం27 అక్టోబర్2025తెలంగాణ వార్త
చిన్నంబావి మండల నూతన ఎంపీడీవోగా యస్. సురుణ ఆదర్శ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో జీఎస్టీ విభాగంలో ఉద్యోగం చేస్తూ, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమై, గ్రూప్-1 పరీక్ష ద్వారా ఎంపీడీవో హోదా సాధించిన ఆయనకు ఇది తొలి పోస్టింగ్. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సురుణ ఆదర్శ గౌడ్ మాట్లాడుతూ, మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రజా సేవలో నిబద్ధతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మండల అధికారులు, ఎంపిఓ రామస్వామి, మండల పరిషత్ కార్యాలయ, సిబ్బంది, నూతన ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలిపారు.