అమ్మ భరోసా కింద నాణ్యమైన వైద్యం

Oct 25, 2025 - 18:07
 0  5
అమ్మ భరోసా కింద నాణ్యమైన వైద్యం

 అడ్డగూడూరు 25 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో అమ్మ భరోసా కార్యక్రమం నిర్వహించారు.అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా మండల వైద్య అధికారి బి.భార్గవి ఆదేశాల మేరకు కోటమర్తి గ్రామానికి చెందిన గర్భిణి స్త్రీ ఇంటికి వెళ్లి ఏ ఖర్చు లేకుండా తనని ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.అనంతరం గర్భిణీ స్త్రీ కి పల్లిపట్టి,స్వీట్లు అందించి మంచి పౌష్టి ఆహారం తీసుకోవాలని సూచించారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దారు నరసింహచారితో పాటు శారద,సరోజన, సంబంధిత ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333