ఈ నెల 30న విద్యాసంస్థల బంద్ కు పిలుపు
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది పిలుపు.
చిన్నంబావి మండలం 27 అక్టోబర్2025తెలంగాణ వార్త
ప్రభుత్వం బకాయిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని విడుదల చేయాలని అక్టోబరు 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపు.బందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వనపర్తి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విడుదల చేయడం జరిగింది.ఈ బంద్ రాష్ట్రంలోనిడిగ్రీ,ఇంజనీరింగ్,పీజీ,ప్రొఫెషనల్కళాశాలలు,యూనివర్సిటీలకువర్తిస్తుందన్నారు.వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలయాజమాన్యాలు సహకరించాలని,విద్యార్థులు బందులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.పోస్టర్ ఆవిష్కరణలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న.నాయక్,ఈశ్వర్,హరీష్,శివ,మహేష్,ప్రసాద్.విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.