తిరుమలగిరిలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు
తిరుమలగిరి 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పోలీస్ కళాబృందంతో తిరుమలగిరి చౌరస్తా లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సంజీవ్ చారి,హోంగార్డ్ రమేష్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి యల్లయ్య, గోపయ్య, సత్యం, చారి, గురు లింగం, కృష్ణ, నాగార్జున లు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.