మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Oct 27, 2025 - 20:56
 0  0
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అకాల మరణం పొందిన మిత్రుని అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి పూర్వ విద్యార్థి మిత్రులు. మండలంలోని గట్టికల్ గ్రామానికి చెందిన గాలి ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1996-97 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ.14000 రూపాయలు నగదును సేకరించి మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు కలరు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. అప్త మిత్రుడు ప్రసాద్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామా రేపాల్, కోన అయోధ్య రాములు, మడ్డి మల్లేష్, పాయిలి వెంకటేశ్వర్లు, ఉపేంద్ర చారి, పరిపూర్ణాచారి, వెంకటరెడ్డి, జాకటి సైదులు, కోన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.