నిదానమే ప్రధానం ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు

Oct 26, 2025 - 20:22
 0  0
నిదానమే ప్రధానం ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు

అతివేగం ప్రమాదకరం

ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి..

 మద్యం తాగి ఆటో నడపరాదు..

ఆటో పేపర్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ... 

ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు... 

 రోడ్లమీద ఆటోలో నిల్పరాదు...

తిరుమలగిరి 27 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. వలిగొండ తోరూర్ రోడ్డులో బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలో సాయంత్రం వేళ అతివేగంతో కూలీలను తరలిస్తున్న ఆటోలను పట్టుకొని కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరం ఏదైనా  ప్రమాదం జరిగినట్లయితే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి అని హెచ్చరించారు నిబంధనల ప్రకారం మాత్రమే ప్రయాణించగలరు, కానీ అందులో 20 నుంచి 30 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. భద్రతా నియమాల ఉల్లంఘన కూలీలను ఒకరిపైన ఒకరు కూర్చోబెట్టడం, ఆటో వెనుక భాగంలో నిలబెట్టడం వంటివి ప్రమాదకరమైనవి ఆటో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ తమ కుటుంబాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మైనర్ పిల్లలను ఆటోలలో ఎక్కించుకుని కూలి పనులకు తీసుకువెళితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రధాన రహదారులపై ఆటోలను నిర్లక్ష్యంగా నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి