రైస్ మిల్ అని చెప్పి కోళ్ల ఫాo కు అనుమతులు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : వెంటనే రద్దు చేయాలనీ గ్రామస్తుల డిమాండ్. ఆత్మకూరు ఎస్... మండల పరిధిలోని ఇస్తాలపురం గ్రామ సమీపం లో ముందుగా రైస్ మిల్లు నిర్మాణం చేస్తామని చెప్పి కోళ్ల ఫామ్ కోసం పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతుల ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై గ్రామస్తులు విలేకరుల తో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి గత కొద్ది రోజుల క్రితం బాలేంల గ్రామానికి చెందిన పులగం వెంకట్ రెడ్డి రైస్ మిల్లు అనుమతులనీ చెప్పి గ్రామస్తులకు తెలియకుండా కోళ్ల ఫాo కు దొడ్డి దారిన అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. కోళ్ల ఫాo వలన ప్రజలకు అనారోగ్యం, పంటపొలాలు పాడవుతాయనీ పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ బోరు నీరు కలుషితం అవుతాయని తెలిపారు. వెంటనే కోళ్ల ఫాo అనుమతులు రద్దు చేయాలనీ స్థానికులు కార్యదర్శి కి రాత పూర్వకంగా ఇచ్చామని రద్దు చేయక పోతే ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు లింగారెడ్డి, శంకర్ ,మధు, శ్రీనివాస్, జనిమియా, వెంకన్న, భాష, సోమయ్య, నాగరాజు, నర్సయ్య,రాములు,వెంకటేశ్వర్లు ,తదితరులు డిమాండ్ చేస్తున్నారు.