బీ అలర్ట్..  రెండు గంటల్లో భారీ వర్షం.! 

Sep 25, 2025 - 19:25
 0  6
బీ అలర్ట్..  రెండు గంటల్లో భారీ వర్షం.! 

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అయితే, మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మెహదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్, మాసబ్‌ ట్యాంక్, నాంపల్లి, లకిడికాపూల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అలాగే ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల వద్ద నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333