తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే

Jan 19, 2026 - 22:37
 0  265
తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే

 విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

 మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

సీసీ రోడ్లకు డ్రైనేజీ కాలువలకు రూ15 కోట్లతో పనులు ప్రారంభం

మున్సిపాలిటీ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ... 

అన్ని రంగాల్లో మున్సిపాలిటీ అభివృద్ధి...!

తిరుమలగిరి 20 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ ,ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల పంపిణీ తో పాటు చీరల పంపిణీ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అన్నారు అనంతరం... మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం పనిస్తుందని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పేర్కొన్నారు మాలిపురం జంక్షన్ నుండి చెరువు కట్ట వరకు బీటీ రోడ్డు నాలుగు కిలోమీటర్లు వెడల్పు చేయుట - రూ.6.00కోట్లు.తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో వివిధ ప్రదేశాలలో సిసి రోడ్లు-6.00కోట్లు మరియు .సిసి రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణం -3.00 కోట్లు తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కోటిలింగాల కాలనీ ఒకటి నుండి 15 వార్డుల అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మందుల సామెల్ స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిస్తుందని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్నారు. సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణం ద్వారా కాలనీలో గ్రామాల్లో రోడ్లపై నీరు నిలవడం బురద వంటి సమస్యలు తొలగిపోతాయని, అన్నారు. మున్సిపాలిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి సమస్యలు లేని మున్సిపాలిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వర్ అలీ,మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఎల్సోజు చామంతి నరేష్ వార్డు ఇన్చార్జులు, పబ్లిక్ హెల్త్ & ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డి ఈ రమాదేవి , పబ్లిక్ హెల్త్ & ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈఈ అనిల్ , వర్క్ ఇన్స్పెక్టర్ యాకస్వామి, లక్ష్మణ్ సుంకరి జనార్ధన్ జుమ్మిలాల్ వీరేష్ కందుకూరి లక్ష్మయ్య చాగంటి రాములు అంబేద్కర్ మూల అశోక్ రెడ్డి పత్తేపురం సుధాకర్ రామ్ గౌడ్ నూతన సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి