ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు బహిర్గతపరచాలి:సిపిఎం
జోగులాంబ గద్వాల 11 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇచ్చిన గడువులోపు ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను బహిర్గత పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి డిమాండ్ చేశారు.సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ ముందున్న ఎస్బిఐ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా విరాళాల సేకరణ రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించింది అని ఎలక్టోరల్ విధానాన్ని రద్దుచేసి కార్పొరేట్ దాతల వివరాలు బహిరంగ పరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు మార్చి 6తో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు తీరిందని కానీ ఎస్బిఐ బ్యాంకు ఇంకా మూడు నెలల సమయం కావాలని సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖాలు చేయడం హాస్యాస్పదమన్నారు బ్యాంకు మొత్తం డిజిటల్ పద్ధతిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని అటువంటప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు కేవలం ఎలక్ట్రోరల్ బాండ్ల నిర్వహణ కోసం ఐటీ సిస్టమ్ అభివృద్ధి చేయడానికి ఎస్బిఐ సుమారు 60 లక్షలు ఖర్చు చేసిందని దాని నిర్వహణకు మరో 89 లక్షలు ఖర్చు చేసిందన్నారు అంత ఖర్చు చేసి ఇంకా మూడు నెలల సమయం ఎందుకని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న డిజిటల్ ఇండియా అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఏ రాజకీయ పార్టీ ఏయే వ్యక్తుల ద్వారా ఎంత విరాళాలను సేకరిస్తుందో తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని అన్నారు. ఎన్నికల్లో సమీపిస్తున్న కొద్ది దాతలు వివరాలు తెలియకుండా ఉండాలనే ఉదేశ్యంతో ప్రభుత్వమే ఎస్బిఐ ఒత్తిడి తెచ్చి వివరాలను వెల్లడించకుండా చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఎలక్టోరల్ బాండ్ల దాతల వివరాలు బహిర్గతపరిస్తే బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వమే ఎస్బిఐ పై ఒత్తిడి తెచ్చి వివరాలు వెల్లడించకుండా చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే వెంటనే ఎన్నికల బండ్ల వివరాలు బహిర్గత పరచకపోతే సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్బిఐ మేనేజర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ నాయకులు బాలకృష్ణ, రఘు, మజ్జిగ ఆంజనేయులు, గజేంద్ర,విష్ణు ఎల్లన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.