బాణాసంచా విక్రయ షాపులు నిబంధనలు
తెలంగాణ వార్త ప్రతినిధి:నిబంధనలివీ..
వీధుల్లో, నివాసాల మధ్య బాణసంచా విక్రయించరాదు. గ్రామ, పట్టణ శివారుల్లోని ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి.
స్టాల్స్ వద్ద అగ్నిమాపక వాహనాన్ని, ప్రతి స్టాల్ దగ్గర 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు డ్రమ్ముల్లో నీటిని ఏర్పాటు చేసుకోవాలి.
ఒక్కో దుకాణం దగ్గర రెండు ఇసుక నింపిన బకెట్లు ఉంచుకోవాలి.
దుకాణానికి దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి 13 ఏళ్లలోపు పిల్లలకు బాణసంచా విక్రయించరాదు.
పై నిబంధనలన్నీ పాటిస్తూ టపాసుల విక్రయానికి లైసెన్స్ పొందేందుకు రూ .500 చలానాతో ఫైర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు దరఖాస్తు పరిశీలించి ఆర్డీఓ కార్యాలయానికి రెఫర్ చేస్తారు. అక్కడి నుంచి ఆయా మండలాల రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలకు పంపిస్తారు. వారు నిబంధనలకు అనుగుణంగా ఉన్న షాపులకు ఎన్34 ఇస్తారు. ఆ తర్వాతే బాణసంచా విక్రయాలు చేపట్టాల్సి