జె ఏ సి మండల అధ్యక్షుడు గా భూపతి రాములు ఎంపిక

Oct 26, 2024 - 19:19
 0  24
జె ఏ సి మండల అధ్యక్షుడు గా భూపతి రాములు ఎంపిక

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండల అభివృద్ధి సాధన జేఏసీ లక్ష్యం జెఏసి మండల అధ్యక్షులు భూపతి రాములు... ఆత్మకూరు ఎస్. ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ లో నీ పూర్ణిమ ఫంక్షన్ హాల్లో శనివారం మండల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన మండల జేఏసీ అధ్యక్షుడు ఎంపికైన సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రజా శ్రేయస్సు కోరే, ఆత్మకూర్ ఎస్ అభివృద్ధిని కాంక్షించే సామాజిక ఉద్యమకారులందరూ ఒక సామాజిక ఉమ్మడి ఉద్యమ వేదిక JAC గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆత్మకూర్ మండల అభివృద్దే లక్ష్యం గా జేఏసీ ఈ ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తుందనీ ప్రజల తరఫున గళం వినిపించే దిశగా జేఏసీ ఈ ప్రాంత ప్రజలకు సరైన విద్య, వైద్యం, రక్షణ పొందే విధంగా పాటుపడుతుందనీ ఆయన వ్యాఖ్యానించారు.ప్రజల పక్షాన న్యాయవ్యవస్థ సహకారంతో నిలుస్తుందనీ JAC రాజకీయాలలో మార్పు కోసం కొత్తదనం కోసం యువతను ప్రోత్సహిస్తుందనీ తెలిపారు జేఏసీ మండల వ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తిస్తుంది ప్రోత్సహిస్తుందనీ తెలిపారు. ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా పోరాటం చేస్తుందనీ వివరించారు. బెల్టు షాపుల నిషేధం, బహిరంగ మద్యపాన నిషేధం అమలుకు పాటుపడుతుందన్నారు. జేఏసీ చేపట్టి ప్రజా సంక్షేమ సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీలు ఉద్యమ సంఘాలు స్వచ్ఛంద సంఘాలు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ మండల కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆత్మకూర్ ఎస్ జేఏసీ కమిటీ. మండల జేఏసీ అధ్యక్షులు గా సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు,గౌరవ సలహాదారు మరియు లీగల్ అడ్వైజర్ గా న్యాయవాది దండ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు కార్యనిర్వాకులు గా గంపల కృపాకర్, ప్రధాన కార్యదర్శి గా దొంతగానీ కరుణాకర్,కోశాధికారి మేడి కృష్ణ ,సంస్కృతిక కార్యదర్శి - గుండు వెంకన్న , అధికారిక స్పోక్ పర్సన్స్ - భారీ అశోక్,పందిరి మాధవరెడ్డి,తగుళ్ళ జనార్ధన్ యాదవ్, నాగరాజు , లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో ఫయాజ్, కిరణ్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.