ఇప్పటికైనా దివ్యాంగురాలికి న్యాయం చేస్తారా

Oct 22, 2024 - 17:49
 0  1
ఇప్పటికైనా దివ్యాంగురాలికి న్యాయం చేస్తారా
ఇప్పటికైనా దివ్యాంగురాలికి న్యాయం చేస్తారా

ఓ దివ్యాంగురాలు ఓఅడబిడ్డ కన్నీటి గాధ కనికరించండి సారు..

3 చక్రాల బండి మూడేళ్లు తిరిగినా దొరకని న్యాయం  

నాకు న్యాయం చేయండి అంటూ రోదిస్తున్న దివ్యాంగురాలు

న్యాయం చేసేది ఎవరు...? ఆదుకునే అధికారి లేరా...!

కొత్తగూడెం అక్టోబర్ 22:- మూడు చక్రాల బండితో మూడేళ్లుగా దాదాపుగా పది నుండి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తూ తిరుగుతున్న కనుకరించని అధికారులు. అది ఆమే స్థలమేఅని పంచాయతీ సెక్రటరీ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీసు వరకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు కానీ ఎవరు ఆమెకు న్యాయం చేయలేకపోతున్నారు మరి ఎందుకు ? వికలాంగురాలుగా పుట్టడమేనా ఆమె చేసిన తప్పు అదే కనుక నిజమైతే అది దేవుని తప్పిదమే. ఎన్నో సంవత్సరాలుగా ఒక వికలాంగురాలు కలెక్టర్ కార్యాలయం ఎమ్మార్వో ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఫారెస్ట్ ఆఫీస్ కి తిరిగి తిరిగి అలసిపోయింది.ఇప్పుడైనా మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో న్యాయం జరుగుతుందని ఆశతో ఆ వికలాంగురాలు పడుతున్న బాధ ఎవరికి కనిపించడం లేదు. ఉన్నవానికే విలువలిస్తున్న ఈ సమాజంలో ఓ వికలాంగురాలు సొంత స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా ఇల్లే కట్టుకుంటున్న పంచాయతీ సిబ్బంది గాని ఉన్నతాధికారులు గాని ఎవరు స్పందించకపోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి.పూర్తి వివరాల్లోకి వెళితే  జాటోత్ సామ్కు భర్త శ్రీను, వయస్సు 40, వృత్తి: గృహిణి దివ్యాంగురాలు కులము: ఎస్ టి-లంబాడి, ఊరు హర్య తండ గ్రామం, లక్ష్మీదేవిపల్లి మండలం, భద్రాది కొత్తగూడెం జిల్లా.భర్త వదిలివేసిన ఒంటరి మహిళగా జీవిస్తున్నా నాకు ఒక కుమారుడు సంతానము. నేను లోగడ తేది 03 జూన్ 2003 న హర్య తండ వాస్తవ్యులు బానోత్ రాజమ్మ బానోత్ సోమ్ల  వద్ద లక్ష్మీదేవిపల్లి మండలం, రేగళ్ళ రెవిన్యూ పరిధిలోని హర్యతండ గ్రామంలో గల సర్వే నెంబర్ 123/ష, నందు మింజుమలె విస్తీర్ణం 8 కుంటలు భూమిని నేను కొనుగోలు చేసినాను.అట్టి భూమి నుండి నేను నా కుటుంబ అవసరాల నిమిత్తము 6 కుంటలు భూమిని అమ్మినాను. మిగిలిన 2 కుంటలు భూమిని నేను నా ఇల్లు నిర్మించుకోవడానికి ఉంచుకున్నాను. ఆ ఇంటి స్థలంలో ఇంటికి రేకులు వేసుకొంటున్న తరుణంలో,
అదే గ్రామానికి చెందిన అజ్మీర కిషన్ తండ్రి .సామ్య అను వ్యక్తి యొక్క కొడుకులు అయిన అజ్మీర రాజా, అజ్మీర రవి అనే వారు ఆ స్థలం మాది అని నకిలీ దస్తావేజులు సృష్టించి, నాపై దాడి చేసి, నన్ను చంపుతామని  బెదిరించడం జరిగింది. అప్పుడు నేను లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినాను. పోలీస్ వారు మా వివాదాని గ్రామ పెద్ద మనుషుల మధ్య తెల్చుకొమ్మని చెప్పినారు. గ్రామ పెద్దల సమక్షములో గ్రామపంచాయితీ వారు ఆ స్థలం 2 కుంటలు నాదే నని తీర్మానం చేసి ఇచ్చినారు.తర్వాత నేను మళ్ళీ నా స్థలంలో నేను ఇల్లు నిర్మించుకునే క్రమంలో పైన తెలిపిన వారు మళ్ళీ వచ్చి నాపై నా ఇల్లు కట్టదానికి వచ్చిన కూలీ వారిపై సైతం దాడి చేస్తున్నారు.మా కొడుకు వంశీ ని కూడా కొట్టినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టిననూ వారు అడ్డుపడుతూ, నన్ను నా ఇల్లు కట్టే కూలీలను కూడా కొడుతూ దాడికి వస్తున్నారు. ఈ విషయమై నేను పలు మార్లు పోలీస్ వారికి ఫిర్యాదు చేసిననూ పైన తెలిపిన వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా, నేను పాల్వంచలో నివాసం ఉండటం వలన నాకు తెలియకుండా పైన
తెలిపిన వారు నా ఇంటి స్థలాన్ని (2 కుంటలు) పొలం గా మార్చుకుని వ్యవసాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసిన తర్వాత నేను వారిని అద్దుకున్నాను. ఈ విషయమై నేను గత 3 సంవత్సరాల నుండి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగుతూనే ఉన్నాను. మా గ్రామ పెద్దలు సర్పంచ్  కూడా ఆ భూమి నాదేనని, తీర్మానం చేసి చెప్పినా కూడా వీరు వదలకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాయొక్క భూమి కొనుగోలు దస్తావేజును ఒక కాపీని తీసుకొని రావలసిందిగ లక్ష్మీదేవిపల్లి పోలీస్ వారు నాకు తెలిపినారు. నేను అట్టి కొనుగోలు పత్రమును తీసుకొని పోలీస్ వారిని కలిసినప్పటికీ పోలీస్ వారు పట్టించుకోవడం లేదు.
విషయమై 06 ఫిబ్రవరి 2023 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ నందు కూడా ఫిర్యాదు చేసినాను. వారు తగిన విచారణ చేయవలసిందిగా పోలీస్ వారిని ఆదేశించినారు.అయిననూ పోలీస్ వారు స్పందించడం లేదు.నాయందు దయ ఉంచి, దివ్యాంగురాలునైన నా భూమిని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న పైన తెలిపిన హర్యా తండ వాస్తవ్యులు అజ్మీర కిషన్ తండ్రి సామ్య అను వ్యక్తి యొక్క కుమారులైన అజ్మీర రాజా,అజ్మీర రవి అనే వారు నా స్థలాన్ని తమదేనని నకిలీ దస్తావేజులు సృష్టించి నా స్థలంలో నన్ను ఇల్లు నిర్మించుకొనివ్వకుండా అడ్డుపడుతూ నన్ను  మా ఇంటి
నిర్మాణం చేయడానికి వచ్చిన కూలాలను దాడి చేసి, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు, వారి వలన
నాకు ప్రాణ హాని ఉన్నది. కావున నా యందు దయ వుంచి తగిన విచారణ జరిపి నాకు తగిన న్యాయం
చేయవలసిందిగా కోరుతున్న మహిళా దివ్యాంగురాల. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మహిళా దివ్యాంగురాలికి న్యాయం చేస్తారని ఆశతో..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333