ప్రతిఘటన పోరాట సారథి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, రవన్న 9వ వర్ధంతి సభ

ఆత్మకూరు ఎస్. 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రతిఘటన పోరాట సారథి ఆత్మకూర్ ఎస్, ఏపూరు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను మార్చి 11న ఖమ్మంలో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ గ్రూప్ మీటింగ్లు ర్యాలీలు నిర్వహించడం జరిగింది గోదావరి లోయ ప్రతిఘటన పోరాట సారథి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను మార్చి 11న ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో , జిలేరు, డేగల వెంకటకృష్ణ పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలోనూ విప్లవ ప్రభంజనం వీచిన కాలంలో దేశంలో గోదావరి లోయ శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటాలు ఉప్పెనుల ఎగిసే పోరాటాలలో పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నినదీస్తూ యువతను విప్లవోద్యమ నిర్మాణానికి అగ్ర భాగాన నిలిచారు, అలాంటి యువతలో ఒకరే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ భారత విప్లవోద్యమంలో అనేకమంది విప్లవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను ప్రజల కోసం అమరత్వం పొందారు వారి ఆశయాల బాటలో కొనసాగుతామని మార్చి 11 వ తారీకు ఖమ్మం లో జరుగు బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపూరి గ్రామ కార్యదర్శి సుధా గాని వెంకన్న, పగిడి ఎల్లయ్య, కుంట రవి ఉదయ్ ఎస్కే మై బల్లి నారాయణరెడ్డి శ్రీశైలం సైదులు పిచ్చయ్య రాములు తదితరులు పాల్గొన్నారు