ఘనంగా  నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

Mar 6, 2025 - 19:30
Mar 6, 2025 - 21:21
 0  13
ఘనంగా  నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఘనంగా  నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఘనంగా  నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతoగి వీరస్వామి గౌడ్

 సూర్యాపేట, టౌన్ 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ మలి దశ ఉద్యమ నాయకులు, సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్  నిమ్మల శ్రీనివాస్ గౌడ్  జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో  జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.  కేకును కట్ చేసి  నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ని శాలువతో సన్మానించి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా పంతంగి వీరస్వామి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సూర్యాపేట జిల్లాలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మచ్చలేని నాయకుడుగా సూర్యాపేట జిల్లాలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించడం తో పాటు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు అని కొనియాడారు. భవిష్యత్తులో కూడా శ్రీనివాస్ గౌడ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం అసోసియేషన్ సంఘానికి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఆటో యూనియన్, ఎన్నో కార్మిక రంగాల సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అని కొనియాడారు. ఎంతో మంది యువకులను తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన గొప్ప నాయకుడు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పారు.  శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను  తన రియల్ ఎస్టేట్ సభ్యులతో కలిసి  పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా లైన్స్ క్లబ్ సర్వీస్ చైర్మన్ కుమ్మరి కుంట్ల లింగయ్య  సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి,జిల్లా గౌరవ అధ్యక్షులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా కోశాధికారి పాల సైదులు,  పట్టేటి కిరణ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలుగూరీ రమా కిరణ్, ఆకుల మారయ్య గౌడ్ అయితే గాని మల్లయ్య గౌడ్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్  సారగండ్ల కోటేష్ బిల్డర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జానయ్య, అమరవాది శ్రావణ్,నిమ్మల శ్రీకాంత్, ఎరుకల సైదులు,బోమ్మగాని వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333