ప్రతి క్లబ్లో పేదవారికి ఐదు వేల రూపాయలు అందజేస్తాం

Aug 25, 2024 - 21:46
Aug 25, 2024 - 22:03
 0  72
ప్రతి క్లబ్లో పేదవారికి ఐదు వేల రూపాయలు అందజేస్తాం
  • దివ్యాంగులకు 60 లక్షల రూపాయలు వెచ్చించి...
  • చేతి కర్రలు తోపుడు బండ్లు లాంటివి అందిస్తాం...!!
  • తెలంగాణ వార్త ప్రతినిధి....వాసవిఇంటర్నేషనల్
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ఇరుకుల్లా రామకృష్ణ ప్రకటన...!!!

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో/ఆగస్టు 25:- వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సెకండ్ క్యాబినెట్ మీటింగ్ స్థానిక నేలకొండపల్లి వాసవి భవనములో జిల్లా గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది.

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఈ సంవత్సరం రెండువేల క్లబ్స్ పనిచేస్తున్నాయి ఇప్పటివరకు ప్రతి క్లబ్ సుమారుగా 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వారి క్లబ్ స్థాయిని బట్టి సేవ కార్యక్రమాలు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారుగా ఇప్పటివరకి 25 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు జరిగినట్లు మార్చి నెలలో లక్ష 30 వేల నోట్ బుక్స్ బీద విద్యార్థులకు సుమారు 25 లక్షల రూపాయల విలువగల నోట్ బుక్స్ ప్రతి యాక్టివ్ క్లబ్ కి 100 నోట్బుక్ చొప్పున అందజేశామని చెప్పారు.

 జూన్ నెలలో డాన్ టు డస్క్ ప్రోగ్రాం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక్కరోజు ఇంటర్నేషనల్ లో ఉన్న ఆల్ క్లబ్స్ సేవా కార్యక్రమం 60 లక్షల రూపాయల విలువ కలిగిన వస్తువులను అందులకు వికలాంగులకు చేతి కర్రలు మరియు నిత్యవసర సరుకులు కూరగాయల వ్యాపారస్తులకు తోపుడుబండ్లు పర్మినెంట్ ప్రాజెక్టు కింద వాటర్ ట్యాంకులు క్లబ్ స్థాయిలో అందజేశారని అన్నారు. నవంబర్ నెలలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి ప్రతి క్లబ్లో ఒక బీద విద్యార్థికి 5000 రూపాయల చొప్పున కోటి రూపాయలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అందజేస్తామని చెప్పారు.ఇంటర్నేషనల్ పరంగా ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గంగిశెట్టి గంగాధర జగదీష్ కుమార్, చిదిరాల లింగయ్య,కడవెండి శ్రీనివాస్, పోలిశెట్టి శ్రీ శివకుమార్, దోసపాటి వెంకటేశ్వరరావు వైస్ గవర్నర్ ధార నరసింహారావు క్యాబినెట్ సెక్రటరీ గోళ్ళ రాధాకృష్ణమూర్తి కోశాధికారి మా శెట్టి వరప్రసాద్ ,దారా మల్లికార్జునరావు రేగూరి వాసవి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ ,డిస్టిక్ ఆఫీసర్స్, రీజియన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్, క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు నేలకొండపల్లి నుంచి హొ స్ట్ క్లబ్ సభ్యులు రే గూ రి వాసవి , గెల్ల కృష్ణారావు, కొత్త కరుణ, కొత్త వెంకటేశ్వరరావు ,కొత్త రమేష్, కొత్తా రాణి దోసపాటి నాగేశ్వరరావు,, దోసపాటి వెంకటేశ్వరరావు, దోసపాటి అచ్యుతురామయ్య సుమారుగా 200 మంది పాల్గొని విజయవంతం చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State