నూతన మండలాలకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కావాలి ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 25 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మండలాలకు సొంత ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఆదివారం రోజు హైదరాబాదులోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్య మంత్రి ఎనముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన నాగారం, మద్దిరాల, అడ్డగూడూరు మండలాలను గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వలన అద్దె భవనాలలో పాలనా జరుగుతుంది.ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలను మంజూరి చేయాలనీ వినతి లేఖ ద్వారా కోరిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్యమంత్రికి వినతి పత్రం లేఖను అందజేయడం జరిగింది.