నేలకొండపల్లి బైరాగి గుట్ట కోనేరు ఆంజనేయస్వామి దేవాదాయ శాఖ లెక్కల్లో...! మాత్రం లేదా...?

Aug 25, 2024 - 21:49
Aug 25, 2024 - 22:01
 0  89
నేలకొండపల్లి బైరాగి గుట్ట కోనేరు ఆంజనేయస్వామి దేవాదాయ శాఖ లెక్కల్లో...! మాత్రం లేదా...?

గుడిపై ఆధిపత్యం చలాయిస్తున్న" ప్రైవేటు" వ్యక్తులు...?

ఆధ్యాత్మిక భక్తి కంటే.... "ఆదిపత్యం" పైనే మక్కువ...?

ఆదాయం ఖర్చు వివరాలు...?

దేవాదాయ శాఖకు పట్టదా...?

ధూప దీప నైవేద్యం చేసే... పూజారికి అందని పైకం...?

2 లక్షల రూపాయల మేర అప్పులు ఉన్నాయని...? పూజారికి అందని దక్షణ.…?

దేవాదాయశాఖ ఆధీనంలో... 

ఆలయాలల ఖర్చులు, వ్యయం ఉండాలంటున్న భక్తులు...

పాలేరు ప్రతినిధి/తెలంగాణ వార్త ఆగస్టు 25 ఆదివారం

తెలంగాణ వార్త. ప్రతినిధి సేకరించిన వివరాల ప్రకారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో భక్త రామదాసు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం చరిత్ర కలిగిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. కాగా భైరా గి గుట్ట ఆంజనేయస్వామి, కోనేరు ఆంజనేయ స్వామి దేవాలయాలు నేటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దేవాలయాల ఆలనా పాలన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా బైరాగి గుట్ట దేవాలయం దగ్గర విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని పలువురు భక్తులు అంటున్నారు. గతంలో బైరాగి గుట్ట నుండి కొంతమేర గ్రానైట్ను తరలించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. మరో ఆంజనేయ స్వామి దేవాలయం మునీరు పక్కన ఉండటంతో కోనేరు ఆంజనేయస్వామి గా భక్తుల పూజలు అందుకుంటూ ఉంటారు.

  సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఈ దేవాలయాలలో జరుగుతున్న కార్యక్రమాలు గాని ఖర్చులు వ్యయం లెక్కలను పెద్దగా పట్టించుకోర అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించే పూజారికి మాత్రం కనీసం జీతాలు కూడా చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ దేవాలయాలలో రెండు లక్షల రూపాయలు మేర అప్పులు ఉన్నాయని పూజారికి మాత్రం జీతాలు ఇవ్వటం లేదని తెలుస్తోంది. కాగా ఇటీవల ఉండి లెక్కల్లో దేవాలయాలను పర్యవేక్షించే వ్యక్తులు మధ్య బేధాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయాలలోని ఉండి డబ్బులను ఓ ప్రైవేటు వ్యక్తి చేతుల్లో పెట్టారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

ఈ తతంగం అంతా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందన విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి దేవాలయాలలో జరుగుతున్న వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించి ప్రవేటు వ్యక్తుల కబంధ హస్తాల నుండి దేవాలయాలకు విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు. కాగా బైరాగి గుట్ట దేవాలయం వద్ద గతంలో కూడా ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State