ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని జిల్లా అధికారులు, ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ప్రతిజ్ఞ గావించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఏ ఓ వీరభద్రప్ప స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.