చివరి కోరిక రైతు భరోసా డబ్బులు ఇప్పించండి కలెక్టర్ సార్
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, గోపాలపురం గ్రామం,లో కురువృద్ధ రైతు చీకూరి సైదమ్మ99 భర్త వెంకయ్య గారికి రెండు ఎకరాల 5 గుంటలు భూమి(2:5) పాస్ బుక్ నెంబర్ :1064, సర్వేనెంబర్ 551-ఆ 1 వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా (నాలాగా) మార్చారు గత ప్రభుత్వ కాలం నుంచి పోరాడుతున్న రైతుబంధు ఇవ్వలేదు. స్వాతంత్ర సమరయోధుడైన సైదమ్మ భర్త (రజకల పోరాట) స్వతంత్ర సమరయోధుడు పింఛన్ కూడా తన తన భర్తకి ఇవ్వలేదని.
రైతు బంధు అన్న ఇస్తానని ఎదురుచూసి.. తను కాలం చేశారని. అధికారుల నిర్లక్ష్యం వల్ల కష్టపడి సంపాదించిన భూమినీ నాలా నుంచి తొలగించి పాస్ బుక్ ఇవ్వాలని. దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవట్లేదు.
ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారా ఆశపడింది. తన చివరి కోరిక... ఆ డబ్బులు అందుకోవాలనీ.. ఆశపడుతున్నానుఅని** విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థకు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలికి లీలావతి కోరినది.**
గౌరవనీయులైన రేవంత్ రెడ్డి, గౌరవనీయులైన కలెక్టర్ మీ దృష్టికి సైదమ్మ కురువృద్రాలు 99 సంవత్సరాలు ఆమెచివరి కోరికను తీర్చాలని విన్నపం ఒక పోరాటం ద్వారా తెలియజేస్తున్నాము.
ఈ నెలలో వచ్చే రైతు భరోసా కైనా.. కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని విన్నపం.