దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం
15-02-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో ఆదివారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఈరోజు చాలా విశేషం అని సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి, మరియు దేవాదాయ కమిటీ అధ్యక్షులు బిచ్చన్న, క్యాషియర్ సతీష్ కొనియాడారు.
చిన్నంబావి మండలం గూడెం గ్రామంలో వెలసిన భీమేశ్వర స్వామి అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రతిష్టత ఉందని సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి భీమేశ్వర ఆలయం గురించి వివరణ ఇచ్చారు.
ఆదివారం శివరాత్రి పండుగ రోజున రాత్రి జాగారం చేస్తారని అలా చేయడంతో సమస్త పాపాలు నశించి వ్యాపార సుఖములు, వ్యాపారా లాభములు అనుభవిస్తారని పెద్ది బాలకృష్ణ అన్నారు.
అదేవిధంగా అర్ధనారీశ్వరుడైన మహాదేవుని కి అత్యంత ప్రతి పవిత్రమైనది ఇలాంటి మహా పర్వదినాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మన కర్తవ్యం దంపతులతో ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందాలని ఆలయ భక్తులకు విజ్ఞప్తి చేశారు. శివరాత్రి రోజు దంపతులచే రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన అలంకారాలు లలితా దేవికి జరుగునని ఆలయ పెద్దలు తెలియజేశారు.
దీనికంటే ముందు భీమేశ్వరుని కి ఉదయం బ్రాహ్మణుల వేదమంత్రాలు చే భీమేశ్వరునికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ఆలయ కళ్యాణ మండపంలో హోమం కార్యక్రమంకూడ నిర్వహించారు.
ఈరోజు తెల్లవారుజామున శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరుగును.
తదన అనంతరం రోడ్డ కురుమయ్య దంపతుల అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును.
ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా అభిషేకం, హోమం కార్యక్రమంలో కొత్త వెంకట్ రెడ్డి దంపతులు, రోడ్డ కురుమయ్య దంపతులు,, చనమోని విజయ్ దంపతులు, బత్తుల నరేష్ దంపతులు, చటమోని సురేందర్ దంపతులు పాల్గొన్నారు. వీరితోపాటు గ్రామస్తులు తోట బాలకృష్ణ, మంగలి నాగరాజు, చిన్న నరసింహ, డీలర్ వెంకటయ్య, గుమ్మడం బాలేశ్వరి, ఆలయ పూజారి నాగయ్య చారి, పెద్ద నాగశేషి, గుమ్మడం శ్రీకాంత్ సాగర్, మేకల విష్ణు.
వీరితోపాటు గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.