రాజకీయ చాణక్యుడు గాదరి కిశోర్ కుమార్..!
తిరుమలగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ కు గెలుపుకు కృషి
15వార్డులలో 10వార్డులకు పై గెలిచినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
తిరుమలగిరి బీఆర్ఎస్ విజయంలో చక్రం తిప్పిన గాదరి కిశోర్ కుమార్
తిరుమలగిరి మునిసిపాలిటీ పై గులాబీ పార్టీ జెండా ఎగిరింది. దీంతో కాంగ్రెస్ నాయకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులకు అయితే దిమ్మ తిరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట జిల్లా పరిధిలోకి వస్తుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఆ మాట కొస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి , తెలంగాణ క్యాబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే సాదా సీదా నాయకుడు కాదు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతకాలం పాటు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
అంతేకాదు తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా ఈ ప్రాంతానికి చెందిన నాయకుడే. అలాగే తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ చైర్మన్ నగరగారి ప్రీతం కూడా తుంగుతుర్తి వాసే. వీరందరితో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తుంగుతుర్తి స్వంత నియోజకవర్గం.అంటే అనేకమంది కాంగ్రెస్ అతిరథ మహారథులు ఉన్న ప్రాంతం తుంగతుర్తి . అయితే ఇంతమంది కాంగ్రెస్ నేతలను ఎదుర్కొంటూ తుంగతుర్తి పురపాలక సంఘం ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. అయితే బీ ఆర్ ఎస్ గెలుపులో కీలకపాత్రను మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పోషించారు.
కాంగ్రెస్ నేతల వ్యూహాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ వాటికి ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ గులాబీ పార్టీ అభ్యర్థులను గెలుపుతీరాలకు గాదరి కిశోర్ కుమార్ చేర్చారు.వాస్తవానికి మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే గాదరి కిశోర్ కుమార్ రంగంలోకి దిగారు. Brs సీనియర్ నాయకుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డిని తమ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు తుంగుతుర్తిలోనే గాదరి కిశోర్ కుమార్ మకాం పెట్టారు. రాత్రింబవళ్లు రఘునందన్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు. తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో ఇంటింటికి తిరిగారు. ప్రతి ఇంటి గడప దగ్గరకు వెళ్లారు. గులాబీ పార్టీ గెలిస్తే చేసే మంచి పనుల గురించి ప్రజలకు వివరించారు. అంతిమంగా తిరుమలగిరి లో బీఆర్ ఎస్ ను గాదరి కిశోర్ కుమార్ గెలిపించారు. మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. ఇదిలా ఉంటే, గాదరి కిశోర్ కుమార్ కృషి ఫలించడానికి కారణాలు లేకపోలేదు. తుంగతుర్తి నియోజకవర్గానికి రెండు సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు కిశోర్ కుమార్. ఎమ్మెల్యేగా పనిచేసిన తొమ్మిది సంవత్సరాల కాలంలో అనునిత్యం తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ది గురించే ఆయన ఆలోచించారు.
కిశోర్ కుమార్ కృషి ఫలితంగానే నియోజకవర్గ పరిధిలోని అనేక గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అయ్యాయి. అంతేకాదు... వంద పడకల ఆస్పత్రి, చెక్ డ్యామ్, అనేక వంతెనలు, రహదారుల నిర్మాణం ..ఇవన్నీ గాదరి కిశోర్ ఎమ్మెల్యేగా ఉన్న జమానాలో జరిగినవే. దశాబ్దాలుగా జరగని అనేక పనులను తన హయాంలో చేసి చూపించి కొత్త చరిత్ర లిఖించారు గాదరి కిశోర్. 2014 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి గాదరి కిశోర్ మూడోసారి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ ఓటమితో ఆయన ఎక్కడా మనోస్థైర్యం కోల్పోలేదు. రాజకీయంగా డీలా పడలేదు. తుంగతుర్తి ప్రజలనే అంటి పెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గంలోనే పర్యటిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా గాదరి కిశోర్ వ్యవహరిస్తున్నారు. గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా , నేనున్నానంటూ అక్కడకు వెళుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారం దిశగా తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు గాదరి మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే తిరుమలగిరి మునిసిపాలిటీ లో గులాబీ జెండా ఎగిరింది.