మహాశివరాత్రి సందర్భంగా నకిరేకల్‌లో భక్తులకు త్రాగునీటి ఏర్పాటు
వేముల శ్రీను 15 పిబ్రవరి తెలంగాణ వార్త ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం త్రాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలోని నకిరేకల్ శివాలయంలో జరుగుతున్న వేడుకలకు హాజరయ్యే వేలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆదివారం శివాలయానికి వెళ్లే మార్గంలో ఈ సేవలను అందించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక శ్రీ దత్త సాయి వాటర్ ప్లాంట్ యజమాని కొండ పాండు సహకారం అందించారు. క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ఉప్పల రమేష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, చెరువుగట్టు దేవాలయం ధర్మకర్త వీరవెల్లి రఘునాథ్, క్లబ్ కోశాధికారి అండెం వెంకన్న, ఎల్లపు రెడ్డి యాదగిరి రెడ్డి, బొడ్డు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
భక్తుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ త్రాగునీటి ఏర్పాటు భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంది.