ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ

Apr 29, 2024 - 18:50
 0  11
ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ

జోగులాంబ గద్వాల 29 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల్ . జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన 06 ప్రజా ఫిర్యాదులను  జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS  స్వీకరించారు.


  ఈ సందర్భంగా ఎస్పీ భార్య భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న  సమస్యలకు సంబంధించిన  ఫిర్యాదులను సునితమైనవి గా భావించి  వారిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు పంపి కౌన్సిలింగ్ చేయలని జిల్లా ఎస్పీ  పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో భాగంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ  స్వీకరించి వారితో మాట్లాడుతూ అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదుల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ   ఆదేశించారు. మరియు  పిర్యాదు దారులు  సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా వారికి సూచించారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భర్త వేదింపులకు సంబందించి -01 పిర్యాదు. కూతురు/ కుమారుడు  హత్మహత్యాల పై అనుమానాలకు సంబందించి-0 2 పిర్యాదులు.మిస్సింగ్ కేసుకు సంబంధించి -01 పిర్యాదు. గొడవలకు సంబందించి -01 పిర్యాదు. ఇతర అంశాలకు సంబంధించి -01 పిర్యాదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333