మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

Sep 8, 2025 - 19:13
Sep 8, 2025 - 19:16
 0  13
మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే  బొల్లం మల్లయ్య

మునగాల 08 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :-  మునగాల మండల పరిధిలోని విజయ రాఘవాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్త పస్తం సుధాకర్ మృతి చెందిన సంఘటనని  కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొ ల్లం మల్లయ్య యాదవ్ సోమవారం వారి నివాసంలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి  పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం నర్సింహులగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మొగిలిచర్ల ఆంజనేయులు మాతృమూర్తి మంగమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, కందిబండ సత్యనారాయణ, సోమపంగు సైదులు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State