వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మందుల సామేల్ 

Jul 16, 2024 - 22:07
Jul 16, 2024 - 22:10
 0  11
వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మందుల సామేల్ 

అడ్డగూడూరు 16 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- చెట్లను పెంచడం ద్వారా ప్రాణవాయువు పెంచవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరదిలోని ధర్మారం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చెట్లను పెంచడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని,మంచి ఆక్సిజన్ ను అందించి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటాయి అని అన్నారు.మానవులకు ముఖ్యంగా గాలి అవసరం ప్రతి ఒక్కరు చెట్లు నాటాలన్నారు. చెట్లను పెంచడం వల్ల జీవకోటి మనుగడకు అందాలన్న చెట్లను విరివిగా పెంచాలని కోరారు.

 వాతావరణ సమతౌల్యతను కాపాడి భావితరాలకు కాలుష్య రహిత నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు పాటు పాడాలని సూచించారు.నూతనంగా అడ్డగూడూరు మండల కేంద్రం నుండి లక్ష్మీదేవికాల్వ గ్రామం వరకు నిర్మించిన డబల్ రోడ్డు వెంబడి చెట్లను నాటడం శుభ పరిణామామని,వాటిని సంరక్షించే బాధ్యత కూడా మర్చిపోవద్దని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కృష్ణయ్య,ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత,ఎమ్మార్వో శేషగిరిరావు,పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,ఉపాధి హామీ ఎపిఓ రవీందర్,వెంకట్ రెడ్డి,గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్,నాయకులు జోజి,సోమిరెడ్డి,నర్సయ్య,ఫీల్డ్ అసిస్టెంట్లు,శివయ్య,నాగయ్య,అంజయ్య వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షులు మంటిపెళ్లి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.