జిల్లాలో రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృశ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప.

Apr 29, 2024 - 18:48
 0  100
జిల్లాలో రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృశ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జోగులాంబ గద్వాల 29 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. తేదీ 29.4.2024 న జిల్లా ఉప .వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.కె సిద్ధప్ప.  జోగులాంబ గద్వాల జిల్లాలో రోజురోజుకు  అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా ప్రజలకు  ఆరోగ్య సూచనలు సలహాలు పత్రిక ముఖంగా తెలియజేశారు..  జోగులాంబ గద్వాల జిల్లాలో   ఉష్ణోగ్రతలు రోజు రోజుకు ఎక్కువగా నమోదవుతున్నందు వల్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. ప్రతి వ్యక్తి ప్రతిరోజు దాహం కాకున్నా ఎక్కువగా నీరు తాగాలి. ఒక ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ పౌడర్ ని ఒక లీటర్ నీటిలో కలిపి అవసరమైనంతవరకు తాగాలి.. అదేవిధంగా దాహం అయినచో కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ లేదా లస్సి, ఫ్రూట్ జ్యూస్ తాగాలి.. బయటికి ప్రయాణం చేసినచో తప్పనిసరిగా వాటర్ బాటిల్ ని వెంట తీసుకెళ్లాలి.. కాలానుగుణంగా అందుబాటులో ఉండే పండ్లు ,కూరగాయలు తినాలి ముఖ్యంగా వాటర్ మిలన్ , మస్క్ మిలన్ ,ఆరెంజ్, ద్రాక్ష,  పైనాపిల్ ,దోసకాయ మొదలగునవి తినాలి.. అవసరమైతేనే పనులు ఉంటేనే బయటికి వెళ్లాలి, అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఉదయం కానీ సాయంత్రం కానీ బయటికి వెళ్లాలి.. బయటికి వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకొని , లేదా టవల్  తో తలపాగా ధరించి వెళ్లాలి లేదా గొడుగు వెంట తీసుకెళ్లాలి.. అదేవిధంగా తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు లేదా బూట్లు ధరించి వెళ్లాలి..
 ఏ వ్యక్తికైనా వడదెబ్బ లక్షణాలు ఉన్నచో సాధ్యమైనంత తొందరగా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు వెళ్లి చికిత్స చేసుకోవాలి.. అని ప్రజలకు పలు సూచనలు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333