పాలియేటివ్ కేర్ అడ్మిషన్లు పెంచాలి
డిఎంహెచ్వో డాక్టర్ ఎస్ కే సిద్దప్ప
జోగులాంబ గద్వాల 3 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు ఉదయం 12 గంటలకు జిల్లా ఆసుపత్రిలో ఉన్న పాలియేటివ్ కేర్, ఎల్డర్ లీకేర్, మెంటల్ హెల్త్ క్లినిక్, ఎన్సిడి క్లినిక్, సర్వైకల్ స్క్రీనింగ్, సంబంధిత డాక్టర్లు మరియు స్టాఫ్ అందరికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు అడ్మిషన్లు ఓపి సేవలు అన్ని విభాగాల యందు అడిగి తెలుసుకున్నారు... జిల్లా నందు ఉన్న క్యాన్సర్ పేషెంట్ల యొక్క వివరాలు తెలుసుకొని.. అవసరమైన వారికి అడ్మిషన్ చేసుకొని చికిత్స అందివ్వాలని అదేవిధంగా హోమ్ కేర్ లో Low, మీడియం వారికి కూడా ఇంటిదగ్గర హోమ్ కేర్ సిబ్బంది వెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలని అవసరమైన వారికి అంబులెన్స్ ద్వారా జిల్లాకు పంపాలని సూచించారు. అబ్నార్మల్స్ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లాకు వచ్చిన బిపి షుగర్ వారికి కూడా జిల్లా నందు ఫాలోఅప్ నిర్వహించి మందులు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఉంటుందని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ, డాక్టర్ ప్రదీప్ కుమార్, డిపి సి శ్యాంసుందర్, తదితరులు ఉన్నారు.