పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎండి )నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి మండల ప్రజలు
పశు వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి.

జోగులాంబ గద్వాల 29 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం పాడి రైతులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి అనగా మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి(FMD) నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. పశువైద్య సిబ్బంది ఆయా గ్రామాలకు వచ్చి ఉచితంగా పశువులకు టీకాలు వేస్తారు.కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించుకొనగలరని
మండల పశువైద్యాధికారి రైతులను కోరారు .