పాఠశాలలో క్లాత్ బ్యాగుల పంపిణీ

* ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణహితమైన వస్తువు వాడండి ఎంఈఓ నకిరేకంటి రవి

Feb 25, 2025 - 20:08
Feb 26, 2025 - 02:28
 0  27
పాఠశాలలో క్లాత్ బ్యాగుల పంపిణీ

*పాఠశాలలో క్లాత్ బ్యాగుల పంపిణీ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణహితమైన వస్తువు వాడండి ఎంఈఓ నకిరేకంటి రవి

తెలంగాణ వార్త పెన్ పహాడ్ ఫిబ్రవరి 25 : మండల కేంద్రంలోగ్రీన్ క్లబ్ సూర్యాపేట సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్లాత్ బ్యాగ్స్ ను మంగళవారం పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ నకిరేకంటి రవి పాల్గొని మాట్లాడుతూ భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి పెను ముప్పుగా తయారైన ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణహితమైన గుడ్డతో తయారుచేసిన చేతి సంచులను ఉపయోగించడం ద్వారా ఈ ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే ప్రకృతి హితమైన కార్యక్రమాల నిర్వహణలో గ్రీన్ క్లబ్ సంస్థ పాత్రను కొనియాడుతూ పాఠశాల విద్యార్థులకు సిబ్బందికి క్లాత్ బ్యాగ్స్ అందించినందుకు వారికి పాఠశాల తరుపున ధన్యవాదాలు తెలిపారు గ్రీన్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను విచ్చలవిడి వాడకం పర్యావరణానికి పెనువిపత్తుగా తయారైందని ఈ ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ వేయడం వలన అవి తిని ఆవులు గేదెల వంటి జంతువుల జీర్ణాశయంలో ప్లాస్టిక్ పేరుకుని పోయి మూగజీవుల మరణానికి కారణమవుతున్నదని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ బ్యాగుల వాడకం గురించి సమాజాన్ని చైతన్యం చేయాలని, ప్లాస్టిక్ తో తయారుచేసిన భోజనం ప్లేట్లు,టీ కప్పుల స్థానంలో మోదుగు ఆకులతో లేదా తామర ఆకులతో తయారుచేసిన విస్తర్లను ఉపయోగించాలని సూచించారు అనంతరం గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు పాఠశాలవిద్యార్థులకు,సిబ్బందికి క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ఉపాధ్యక్షులు మారం పవిత్ర, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్,కార్యవర్గ సభ్యులు మిర్యాల వెంకటేశ్వర్లు, పి.వీ లక్ష్మీనారాయణ, తల్లాడ రామచంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు....

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State