తుంగతుర్తిలో 16న జరిగే ఎస్సీ వర్గీకరణ,బిసి కులగనన సభను విజయవంతం చేయాలి!
మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి

అడ్డగూడూరు 13 మార్చ్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్చి 16న జరగబోయే ఎస్సీ వర్గీకరణ బిసి కులగలన సభను విజయవంతం చేయాలని అడ్డగూడూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జ్యోజి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, రాష్ట్ర టిపి సిసి నాయకులు ఇటికాల చిరంజీవి, బాలెoల సైదులు, మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి,మోత్కూర్ డైరెక్టర్ బాలెంల విద్యా సాగర్,చిత్తలూరు సోమయ్య, మహిళా అధ్యక్షురాలు యాదమ్మ, మాజీ పిఎసిఎస్ చైర్మన్ చిత్తలూరి హనుమంతు, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ,వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, కోటమర్తి మాజీ సర్పంచ్ చిప్పలపల్లి బాలు, కంచరపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చెరుకు వెంకన్న, నిమ్మల నర్సయ్య వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపేల్లి గంగయ్య, యూత్ కాంగ్రెస్ సభ్యులు మందుల సోమయ్య, మరియు వివిధ గ్రామల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.