శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న బ్యాంక్ అధికారి .

Mar 12, 2025 - 20:05
 0  0
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న బ్యాంక్ అధికారి .
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న బ్యాంక్ అధికారి .

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి ఆది శిలా క్షేత్రం మల్ధకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బుధవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ అధికారి సత్యనారాయణ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు దేవాలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ఈవో సత్య చంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు వారికి దేవాలయ విశిష్టతను వివరించి స్వామివారి శేష వస్త్రం చరిత్ర పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గంగాధరం, ఎల్డిఎం అయ్యప్ రెడ్డి, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నాగరాజు, చంద్రశేఖర రావు, నరేందర్, పద్మా రెడ్డి, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333