పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు

Dec 26, 2024 - 22:01
 0  2
పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు

నూతనంగా ఆర్ కే చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం 

చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఆర్ కె చిల్డ్రన్స్ హాస్పిటల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మామిడి వెంకట్,  మామూనురి రమేష్ వేల్పుల రవి లు మాట్లాడుతూ గత మూడేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు నూతనంగా పిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉండనుందని అన్నారు. అనుభవం కలిగిన వైద్యుడిచే చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకొని ఆదరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ వినోద్,  తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333