యూనియన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం.

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్ మండల కేంద్రంలో బుధవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన భవనాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘ సభ్యులకు రూ .1 కోటి10 లక్షల చెక్కును అందజేశారు.అనంతరం వారు శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి దేవాలయంలో అర్చన నిర్వహించి స్వామి వారి శేష వస్త్రం బహుకరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ గంగాధరం, ఎల్ డి ఎం అయ్యప్ రెడ్డి, స్టాఫ్ నాగేంద్రబాబు శివశంకర్ ఆశన్న అచ్యుత్ పరశురాముడు రఘు ఉద్యోగి నాగరాజు, పట్వారి అరవిందరావు, దీరెంద్ర దాస్, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.