విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ....!* *అలరించిన స్వపరిపాలన దినోత్సవం*

*విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ....!* *అలరించిన స్వపరిపాలన దినోత్సవం*
తెలంగాణ వార్త *పెన్ పహాడ్ ఫిబ్రవరి 25మండల పరిధిలోని లింగాల గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా మంగళవారం వివిధ నాయకులు, అధికారులుగా వేషాదరణ గావించి ఒకరోజు స్వపరిపాలన కొనసాగించారు విద్యార్థులేఉపాధ్యాయులు,అధికారులు,నాయకులు అయినా వేళ స్వపరిపాలన దినోత్సవం పలువురిని అలరించింది ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబోధనను అందించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా వై ఇసాక్, కలెక్టర్గా జి శివమణి, డీఈఓగా వై హారిక, ఎంఈఓగా సిహెచ్ యూనికే, ప్రధానోపాధ్యాయులుగా ఎం జాగృతి, ఉపాధ్యాయులుగా ఆర్ దీప్తి, ఆర్ యోగేష్, బి పల్లవి, వై బ్లెస్సి, ఎం రేవంత్, ఆర్ సామెల్ పాల్, ఎల్ ఓమిత, వై రోహిత్, పిటిగా జీ ఉదయ్, అటెండర్ గా ఎం రుత్విక్ పాత్రలను పోషించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుడిగం కోటేశ్వరరావు,ఉపాధ్యాయులు బి గోవిందు, బి శ్రీనివాస్ రెడ్డి, కే సతీష్,తదితరులు పాల్గొన్నారు...